. < 1 minute

నగరంలోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం సాయంత్రం ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఘటన కారణంగా కేబుల్ బ్రిడ్జి మీదుగా రోడ్డు నెంబర్ 45 వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేబుల్ బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న ఒక కారులో శుక్రవారం సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే కారు చాలా వరకు కాలిపోయింది. ఈ ఘటన కారణంగా కేబుల్ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లించారు.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.