. < 1 minute

RT Cinema

మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల మాస్టర్, దర్శకుడు కిషోర్ తిరుమలతో కలిసి ‘ఆర్‌టి76’ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాక ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో రాబోయే ఈ చిత్రం గురువారం ముహూర్తపు వే డుకతో ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడు కిషోర్ తి రుమల, రవితేజ సిగ్నేచర్ స్టయిల్, కామెడీతో కూడిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని రాశారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ కథలో రవితేజ తనదైన ఎనర్జీతో అలరించనున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ స్టైలిష్ అవతార్‌లో, డిజైనర్ సూట్ ధరించి కనిపిస్తున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ సీటులో హాయిగా కూర్చున్న అత ను, ముందు సీటుపై ఒక కాలు క్యాజువల్‌గా ఆనించి, ఒక చేతిలో వైన్ బాటిల్, మరో చేతిలో పుస్తకంతో కనిపించడం అదిరిపోయింది. ఇది ఇప్పటివరకు రవితేజ మోస్ట్ స్టైలిష్ లుక్‌ను సూచిస్తుంది.

అతను పట్టుకున్న పు స్తకంలో ‘సీ ఇట్ అండ్ సే ఇట్’ స్పానిష్‌లో ఉంది, ఇది అతని పాత్రపై ఆసక్తిని పెంచుతోంది. బ్లాక్‌బస్టర్ ధమా కా కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించిన తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి రవితేజతో మళ్ళీ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 16 నుండి హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ కానుంది.

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.