
మనుషులకి, జంతువులకి సంస్కారం అనే అడ్డుగీత ఉంటుంది. అదిలేకుంటే మనిషి సమాజంలో ఉన్న జంతుప్రవృతి ఉన్నట్లే లెక్క. అయితే జంతువులు అలా కాదు. వాటి సహజ స్వభావం అవి ఎక్కడున్నా ఒకేలా ఉంటుంది. నమ్మకం, విశ్వాసం, నిజాయితీ, నిస్వార్ధం.. ఈ విషయాల్లో జంతువుతో పోల్చితే మనిషి ఫెయిల్. ప్రమాదం పొంచి ఉందని తేలితే అయినవారిని కూడా తుంగలో తొక్కేరకం మానవ స్వభావం. కానీ జంతువులు అలా కాదు. ఆశ్రయం ఇచ్చినవారికి, పట్టెడన్నంపెట్టి కడుపు నింపినవారి కోసం ప్రాణాలు పణంగా పెడతాయి. ఇది నిజమేనని చెప్పే సంఘటన తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
మీరట్‌లోని దౌరాలాలో నగర్ పంచాయతీ దౌరాలాలోని 6వ వార్డులోని మొహల్లా రాంపురిలో కల్లు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వీరి ఇంట్లో అమెరికన్ బుల్ జాతికి చెందిన పెంపుడు కుక్క మిని ఉంది. అయితే మే 2వ తేదీన తెల్లవారు జామున 3 గంటలకు అత్యంత విషపూరితమైన పాము ఒకటి కల్లు ఇంట్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో ఇంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. పామును పసిగట్టిన వరండాలోని మిని కొద్దిసేపు మొరిగి ఇంటి యజమానికి సిగ్నల్ ఇచ్చింది. వారు వచ్చేలోపు పామును ఇంట్లోకి వెళ్లనీయకుండా మిని వీరోచితంగా పోరాడింది. ఈ పోరాటంలో ఆ పాము మినిని అనేక చోట్ల కరిచి గాయపరిచింది. కుక్క మొరిగే శబ్దం విని బయటకు వచ్చేసరికి, కుక్క అపస్మారక స్థితిలో పడి ఉంది. దాని నోట్లో పాము గట్టిగా పట్టుకుని కదలనీయకుండా పట్టుకుంది. వెంటనే కల్లు పామును బంధించి జనావాసాలకు దూరంగా విడిచిపెట్టాడు.
मेरठ में डॉगी मिनी की मालिक भक्ति को सलाम। मालिक को बचाने के लिए डॉग मिनी सांप से भिड़ गई। सांप ने मिनी को 26 बार काटा,जहर फैलने से 24 घंटे बाद मिनी ने दम तोड़ दिया लेकिन अपने मालिक को बचा लिया। मालिक पर शहीद हुई मिनी।@PetaIndia @peta #meerut pic.twitter.com/vp98h4JrYp
— shalu agrawal (@shaluagrawal3) June 5, 2025
అనంతరం మినిని ఆస్పత్రికి తీసుకెళ్లగా దాని బాడీపై ఏకంగా 26 పాము కాటు గుర్తులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చికిత్స అందించినప్పటికీ పాము కాటు కారణంగా 27 గంటలు ప్రాణాలతో పోరాడి మిని మృతి చెందింది. మినిని కాటు వేసిన పాము రస్సెల్ వైపర్ కోబ్రా అని యజమాని తెలిపాడు. అది అత్యంత విషపూరితమైన పాము. ఇవి కోపంగా ఉండే స్వభావం కలిగి ఉంటాయి. ఈ పాము కరిస్తే అమోటాక్సిన్ విషాన్ని విడుదల చేస్తుంది. దాని కాటు తర్వాత రక్తం గడ్డకట్టి గంటలోపే మరణం సంభవిస్తుంది.
मेरठ में एक डॉगी ने मालिक के बेटे को बचाने के लिए अपनी जान दे दी: रसेल वाइपर सांप से भिड़ गई, जबड़े में दबाया, 26 बार डसा फिर भी नहीं छोड़ाhttps://t.co/P47MKc5AMC#Uttarpradesh #Meerut #DogLovers pic.twitter.com/OFxGftYmf5
— Dainik Bhaskar (@DainikBhaskar) June 5, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.