
మన శరీరంలో తల తడిగా ఉండటం అంటే.. శరీర ఉష్ణోగ్రత కొంచెం తగ్గిపోయి, లోపలి సమతుల్యత కొంత నెమ్మదిస్తుంది. ఇలాంటి సమయంలో తక్కువ ఉష్ణోగ్రతకు సంబంధించిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి సమస్యలు రావచ్చు. కొన్ని ఆహార పదార్థాలు తలనొప్పులు, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులు, జీర్ణ సమస్యలు మొదలైన వాటికి దారి తీస్తాయి.
చల్లని లేదా ఫ్రీజ్ చేసిన పానీయాలు, ఐస్ క్రీమ్ తల తడి ఉన్న సమయంలో తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయి.. ముక్కు పట్టేయడం, తలనొప్పి లాంటి సమస్యలు రావచ్చు.
తేనె పెరుగు ఈ రెండు పదార్థాలు శరీరంలో గ్యాస్ ఏర్పడటానికి కారణమై.. జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేయడానికి కారణమవుతాయి. ముఖ్యంగా తల తడి ఉన్నప్పుడు ఇవి శరీరంలో కఫం ఉత్పత్తిని పెంచి ఇబ్బందులను కలిగిస్తాయి.
మిరియాలు, మిరపకాయలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తల తడితో ఉన్న సమయంలో తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి తలనొప్పి, తల బరువుగా అనిపించడం లాంటి సమస్యలు రావచ్చు.
అధిక నూనె లేదా వేయించిన ఆహారాలు అరుగుదలను తగ్గిస్తాయి. శరీరంలో తలనొప్పి, అజీర్తికి కారణమవుతాయి. అందుకే తల తడిగా ఉన్నప్పుడు వీటిని తినకపోవడం మంచిది.
పులుసులు, పులిహోర లాంటి పుల్లగా ఉండే ఆహారాలు శరీరంలో ఆమ్ల స్థాయిని పెంచి తలనొప్పులు రావడానికి కారణమవుతాయి.
చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలో మార్పులు తెచ్చి.. శరీరంలో అలసట, మానసిక ఆందోళన లాంటి సమస్యలు కలిగించవచ్చు.
ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ఎక్కువగా ఉండే వంటకాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. తల తడి సమయంలో తీసుకోవడం వల్ల శరీరంలో కఫం, జలుబు సమస్యలు పెరుగుతాయి.
తల తడి సమయంలో మీ శరీరం సున్నితంగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో ఎక్కువగా చల్లటి, మసాలా, కారంగా ఉండే ఆహారాలు, అధిక నూనె పదార్థాలు, చక్కెర ఉన్న ఆహారాలు తినకూడదు. ఇవి మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపి.. తలనొప్పులు, జలుబు, అరుగుదల సమస్యలను కలిగిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)