. 2 minutes
Pot water: పేదవాడి ఫ్రిడ్జ్ మట్టి కుండలోని నీరు తాగడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

రిఫ్రిజిరేటెడ్ నీరు త్రాగడానికి చల్లగా , సరదాగా అనిపించవచ్చు కానీ ఆ నీరు తాగడం ఆరోగ్యానికి హానికరం. చాలా చల్లటి నీరు జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. అలాగే రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన నీటిని తరచుగా ప్లాస్టిక్ సీసాలు లేదా కంటైనర్లలో నిల్వ చేస్తారు. ఇవి దీర్ఘకాలిక ఉపయోగం తర్వాత నీటిలోకి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. అదే సమయంలో మట్టి కుండలోని నీరు త్రాగడం అనేది పాత అలవాటు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి., పర్యావరణానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని చల్లదనం, మట్టి సువాసన హృదయాన్ని ప్రశాంతపరుస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మట్టికుండలోని ఇప్పటికీ సైన్స్ దృక్కోణంలో చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఈ రోజు మట్టి కుండలోని నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

మట్టి కుండ నీటి లక్షణాలు
నేలలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు నీటిలో కరిగి, నీటిని మరింత ఆరోగ్యకరంగా మారుస్తాయి. ఈ నీరు జీర్ణక్రియను సరిగ్గా నిర్వహించడంలో సహాయపడుతుంది. శరీరంలోని pH సమతుల్యతను కాపాడుతుంది. కుండలోని బంకమట్టి నీటిని సహజంగా ఫిల్టర్ చేస్తుంది. నీటిని శుభ్రంగా , బ్యాక్టీరియా లేకుండా ఉంచుతుంది. దీనితో పాటు వేసవిలో గొంతు నొప్పి, అలసట వంటి సమస్యల నుంచి కూడా ఇది ఉపశమనాన్ని అందిస్తుంది.

సహజంగా చల్లగా.. రుచికరంగా
మట్టి కుండలోని నీరు విద్యుత్ లేదా ఫ్రిజ్ లేకుండా స్వయంచాలకంగా చల్లగా ఉంటుంది. ఇది వేసవిలో గొప్ప ఉపశమనం ఇస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే నీరు చాలా చల్లగా లేదా చాలా వేడిగా ఉండదు. అంతేకాదు మట్టి వాసన, తేలికపాటి రుచి నీరు తాగుతున్న సమయంలో భిన్నంగా ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇది ఏ ప్లాస్టిక్ లేదా స్టీల్ బాటిల్‌లో కనిపించదు.

పర్యావరణానికి కూడా మంచిది
మట్టి పాత్ర పూర్తిగా సహజమైనది. ఇది ఉపయోగించిన తర్వాత ఎటువంటి హాని కలిగించకుండా మట్టిలో కలిసిపోతుంది. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ శక్తి అవసరం లేదు. ఇది విద్యుత్తును కూడా ఆదా చేస్తుంది. అంతేకాదు ఇది చౌకైనది, మన్నికైనది, పర్యావరణ అనుకూలమైనది, మీరు గ్రామంలో ఉన్నా లేదా నగరంలో ఉన్నా.. మట్టి కుండలు కనిపిస్తూనే ఉన్నాయి.

ఆరోగ్యం- ప్రకృతి స్నేహితుడు

రిఫ్రిజిరేటెడ్ నీరు సౌకర్యాన్ని అందించవచ్చు, కానీ అది ఆరోగ్యానికి ,పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అదే సమయంలో మట్టి కుండలో ఉంచిన నీరు త్రాగటం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది పర్యావరణాన్ని కాపాడటానికి కూడా సహాయపడుతుంది. దీని చల్లదనం ,సహజ ఖనిజాలు మీ శరీరాన్ని తాజాగా ఉంచుతాయి. మీ దినచర్యలో సులభమైన , సహజమైన మార్గాన్ని జోడించాలనుకుంటే మట్టి కుండ నుండి నీరు త్రాగడం ప్రారంభించండి. ఈ చిన్న అడుగు మీ ఆరోగ్యానికి, ప్రకృతికి పెద్ద ప్రయోజనాలను ఇస్తుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.